జిమ్లో వ్యాయమం చేస్తూ గుండెపోటుతో మరణించే ఘటనలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. తాజాగా అలాంటి ఘటనే మరోటి యూపీలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిటీలోని ఓ జిమ్‌లో 19 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో చూస్తుండగానే కుప్పకూలిపోయాడు.
ALSO READ: వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు: సీపీ రెమా రాజేశ్వరి
ఈ దృశ్యాలు జిమ్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 16) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. యువకుడు కుప్పకూలిన వెంటనే జిమ్‌లో ఉన్న మరో ఇద్దరు యువకులు అతని దగ్గరికి వచ్చి సాయపడుతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.
ALSO READ: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సిద్దార్థ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు. మితిమీరిన వ్యాయామం, మానసిక ఒత్తిళ్ల కారణంగానే జిమ్‌లో పనిచేస్తున్నప్పుడు గుండెపోటు, కార్డియాక్ అరెస్టుతో మరణిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
#Shocking
— Ravi Pratap Dubey (@ravipratapdubey) September 16, 2023
A 19 years old young man died while #running on a #treadmill in a #Gym in #Ghaziabad. #CCTV footage of this entire incident shows that this 19 year old boy fell on the treadmill and died.
It is believed that he died because of #heartattack #gymboy #run pic.twitter.com/9kuSZ0MlZC