రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి తాలూకాలోని లచ్యాన్ గ్రామంలో చోటుచేసుకుంది. ఏప్రిల్3వ తేదీ బుధవారం సాయంత్రం సాత్విక్ ముజగోండ్(2) అనే చిన్నారి.. ఇంటి ఆవరణంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు మూతలేని బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని బోర్ వెల్ నుంచి చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | Karnataka: Operation underway to rescue the 1.5-year-old boy in Lachyan village of Indi taluk of the Vijayapura district. https://t.co/0zWcT99XI5 pic.twitter.com/lvJrg1mEMa
— ANI (@ANI) April 4, 2024
చిన్నారి దాదాపు 20 అడుగుల లోతులో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. బోరు బావిలో చిన్నారి పరిస్థితిని తెలుసుకునేందుకు లోనికి కెమెరాతోపాటు ఆక్సిజన్ పైప్ ను పంపించారు. ఘటనాస్థలం దగ్గర వైద్య బృందం, అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. బోరు బావికి సమాంతరం జేసీబీతో గుంత తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగతున్నాయి.
ALSO READ : కూరగాయలు అమ్మేవారికి గొడుగుల పంపిణీ