పొద్దంతా చిరు వ్యాపారాలు.. రాత్రి వేళ హైవేలపై దోపిడీలు

పొద్దంతా  చిరు వ్యాపారాలు.. రాత్రి వేళ హైవేలపై దోపిడీలు
  • ఏడుగురి అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్, పరారీలో ముగ్గురు 
  • వివరాలు వెల్లడించిన 
  • ఎస్పీ రాజేశ్​చంద్ర

కామారెడ్డి, వెలుగు : హైవే పక్కన కొందరు డేరాలు వేసుకుని పొద్దంతా చిరు వ్యాపారాలు చేస్తూ రాత్రి వేళల్లో దోపిడీలకు ప్రాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు.  మహారాష్ర్ట స్టేట్​లోని వార్ధ జిల్లాకు చెందిన 10 మంది ఇక్కడకు వచ్చారన్నారు.  హైవే పక్కన డేరాలు వేసుకొని పొద్దంతా బెలూన్లు, ఇతర చిన్న పాటి వస్తువులు అమ్ముతున్నారన్నారు.

 రాత్రి వేళల్లో హైవేపై  వెహికల్స్​పై దాడి చేసి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల  జిల్లాలోని దేవునిపల్లి, సదాశివనగర్​ పోలీస్​ స్టేషన్ల పరిధిలో హైవేలపై  దోపిడీలు జరిగాయని పేర్కొన్నారు.  ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో  4 స్పెషల్​ టీమ్స్ దర్యాప్తు చేపట్టగా అంతర్రాష్ట్ర ముఠా చిక్కిందన్నారు.  కులి కిషన్ పవర్, జాకీ గుజ్జు బోష్లే,  పవర్​ హరీశ్​,  అనురాగ్ రత్నప్పబోస్లే,  అన్చన,   హవర్​ పవర్,  చూడీలను అరెస్టు చేసినట్లు వివరించారు.   మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. 

ఈ ముఠా దేవునిపల్లి, సదాశివనగర్​ పోలీస్​ స్టేషన్ల పరిధిలోనే కాకుండా నిజామాబాద్​ జిల్లా  ఆర్మూర్,  డిచ్​పల్లి పోలీస్​ స్టేషన్ల పరిధిలో కూడా నేరాలు చేశారన్నారు. ముఠా సభ్యుల నుంచి  సెల్​ఫోన్లు 2, ల్యాప్​ట్యాప్​ బ్యాగ్​ 1, కత్తులు 4, కర్రలు 2, రాళ్లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠా సభ్యులను పట్టుకొవటంతో   సీసీఎస్​ సీఐ శ్రీనివాస్​,  రూరల్, సదాశివనగర్​ సీఐలు రామన్​, సంతోష్, ఎస్సైలు రాజు,  రంజిత్​, సిబ్బంది బాగా పని చేశారని ఎస్పీ అభినందించారు.