అది లేడీస్ హాస్టల్.. పీజీ హాస్టల్.. అందరూ అమ్మాయిలే ఉంటారు.. అలాంటి హాస్టల్లో సెక్యూరిటీ ఎలా ఉండాలి.. ఎంత టైట్గా ఉండాలి.. అలాంటిది ఏమీ లేదు అక్కడ.. హాస్టల్లో అర్థరాత్రి 22 ఏళ్ల యువతికి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి.. అది ఎక్కడో కాదు.. బెంగళూరు సిటీలోని కోరమంగళ ఏరియాలో జరిగింది. బెంగళూరు సిటీలోనే సంచలనంగా మారిన ఈ ఘటనను పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు.. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని కోరమంగళలో ఒక లేడీస్ పీజీ హాస్టల్లో ఉంటున్న 22 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కృతి కుమారి అనే యువతిని బీహార్ కు చెందిన 22 ఏళ్ల యువకుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక 11.30 సమయానికి హంతకుడు హాస్టల్లోకి జొరబడ్డాడు. ఎవరి కంటా పడకుండా కృతి కుమారి థర్డ్ ఫ్లోర్లో ఉన్న రూంలో ఉంటుందని తెలుసుకున్నాడు. ఆమె ఉంటున్న రూంలోకి ప్రవేశించాడు.
Also Read:-ముంబైలో అంతే : రైలు పట్టాలపై నడుచుకుంటూ ఆఫీసులకు జనం !
ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయి వెళ్లి తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆ యువకుడు కృతి కుమారి గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. లేడీస్ హాస్టల్.. అది కూడా అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఆ హాస్టల్ లో ఉంటున్న మహిళలంతా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కొందరు యువతులైతే రాత్రికి రాత్రే పీజీ ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన బెంగళూరులో పీజీల్లో ఉంటున్న యువతులను ఉలిక్కిపడేలా చేసింది.