ఆడవాళ్లు వయసు విషయంలో అసలు బయటపడరు. ఎప్పటికప్పుడు యవ్వనంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. నోరుజారి ఎవరినైనా ఆంటీ అంటే అసలు ఒప్పుకోరు. ఒక మహిళను ఆంటీ అన్నందుకు జుట్టుపట్టుకొని కొట్టుకొనేదాక వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఎటాలోని షాపింగ్ సెంటర్‌కు ఒక 40 ఏళ్ల మహిళ తన స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వచ్చింది. అదే సమయంలో 19 ఏళ్ల మరో యువతి కూడా తన స్నేహితురాలితో కలిసి షాపింగ్‌కు వచ్చింది. ఎవరికి కావలసినవి వారు చూస్తుండగా.. యువతి మహిళను ఆంటీ కొంచెం పక్కకు జరగండి అన్నది. దాంతో నన్నే ఆంటీ అంటావా అంటూ 40 ఏళ్ల మహిళ ఆగ్రహంతో ఊగిపోయి 19 ఏళ్ల యువతిని లాగి చెంపదెబ్బ కొట్టింది. ఆ తర్వాత మహిళ స్నేహితులు కూడా యువతిని పట్టుకొని చితకబాదారు. యువతిని లాగి, జుట్టుపట్టుకొని కొట్టారు. అటుగా వచ్చిన మహిళా పోలీసు వారిని విడదీసి గొడవ సద్దమణిగేలా చేసింది. సోమవారం సాయంత్రం బాబుగంజ్ మార్కెట్లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
यूपी के एटा में आंटी कहने पर भड़की महिला, करवा चौथ की खरीददारी छोड़ बाल पकड़कर पीटा#UttarPradesh pic.twitter.com/yIr9werUzW
— Hindustan (@Live_Hindustan) November 3, 2020
For More News..