బచ్చన్నపేట, వెలుగు : తెలంగాణ పల్లె ప్రాంతాల్లో వైద్య సేవలు బాగున్నాయని, తమ వద్ద కూడా అమలు చేస్తామని ఒడిస్సా నుంచి వచ్చిన వైద్యబృందం సభ్యులు తెలిపారు. నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ఒడిస్సా రాష్ట్రం నుంచి 42 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం జనగామ జిల్లాకు వచ్చి, రెండు బృందాలుగా విడిపోయి 22 మంది జిల్లాలోని జఫర్గడ్ మండలానికి వెళ్లగా
మిగితా 20 మంది సభ్యులు బచ్చన్నపేట మండలం ఆలింపూర్ హెల్త్ సబ్సెంటర్కు వచ్చారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జనగామ డీఎంహెచ్ఓ శ్రీదేవి, ప్రోగ్రాం ఆఫీసర్లు రవీంధర్గౌడ్, భాస్కర్, బచ్చన్నపేట మెడికల్ఆఫీసర్శృజన వైద సిబ్బంది పాల్గొన్నారు.