హైదరాబాద్లో ఫంక్షన్కు పోయి నైట్ 2 గంటలకు.. ఆటోలో ఇంటికి వెళుతుండటమే ఈమె చేసిన పాపమా..!

హైదరాబాద్లో ఫంక్షన్కు పోయి నైట్ 2 గంటలకు.. ఆటోలో ఇంటికి వెళుతుండటమే ఈమె చేసిన పాపమా..!

హైదరాబాద్: సికింద్రాబాద్లో ఆకతాయిల ఆగడాలకు ఒక మహిళ నిండు ప్రాణం బలైపోయింది. వెంటాడుతున్న పోకిరీల బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా కోట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి బాలంరాయిలో ఓ ఆటోలో ఉన్న మహిళను వెంబడిస్తూ అసభ్యంగా కామెంట్లు చేస్తూ మహిళ వెళుతున్న ఆటోను ఆపే ప్రయత్నం చేశారు ఇద్దరు బైకర్లు.

మద్యం మత్తులో ఉండడం, అసభ్యంగా సైగలు చేస్తుండడంతో వారిని తప్పించే ప్రయత్నంలో ఆటో డ్రైవర్ బాలంరాయి సర్కిల్ వద్ద యూ టర్న్ తీసుకోగా, అదుపు తప్పిన ఆటో పోల్ను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కార్ఖానకు చెందిన జవేరియా రిజ్వానా(47) అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

రిజ్వానా తన కొడుకు మహ్మద్ మాజ్ అహ్మద్(20)..కూతురు ఆయేషా సల్మా(11) తో కలిసి టోలి చౌకిలో జరిగిన ఫంక్షన్కు హాజరై 24 వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో తిరిగి వస్తుండగా వారిని నల్లగుట్ట ప్రాంతం నుంచి వచ్చిన యువకులు రెండు బైక్లతో వెంబడించారు. బైక్పై వచ్చిన యువకులు మద్యం మత్తులో ఉన్నారని, బూతులు తిడుతూ ఆటోను ఆపే ప్రయత్నం చేశారు.

►ALSO READ | రంగారెడ్డి జిల్లాలో ఈ హోం గార్డు.. గుండెపోటుతో చనిపోయిండు.. హార్ట్ అటాక్కు ముందు ఏం జరిగిందంటే..

దీంతో ఆటో డ్రైవర్ వారి నుండి తప్పించబోయి బాలంరాయ్ రాయల్ లీ ప్యాలెస్ వద్ద యూ టర్న్ తీసుకోవడంతో ఆటో ఎదురుగా ఉన్న  పోల్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఆటో ప్రమాదానికి గురై రిజ్వానా చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగుట్టలో లభ్యమైన సీసీ ఫుటేజ్ల ఆధారంగా బేగంపేట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.