
హైదరాబాద్: భాగ్యనగరంలో కల్తీ వంట నూనె అమ్మకం కలకలం రేపింది. సిటీలోని మలక్ పేట్లో ఉన్న శ్రీ కృపా మార్కెట్లో ఒక వంట నూనెల దుకాణంలో కల్తీ నూనె అమ్ముతున్నట్లు అధికారులకు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది.
బల్క్లో వంట నూనె బయట కొని నకిలీ లేబుల్స్ బాటిల్స్పై, డబ్బాలపై అంటించి బ్రాండెడ్ వంట నూనెల పేరుతో షాపు యజమాని అమ్ముతున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఎక్సైరీ డేట్ను, బ్యాచ్ నంబర్స్ను వైట్నర్తో చెరిపేసి కస్టమర్లకు ‘ఫ్రెష్ హార్ట్’ సన్ ఫ్లవర్ ఆయిల్ పేరుతో వంటనూనెను షాపు యజమాని అశోక్ కుమార్ అగర్వాల్ అమ్ముతున్నట్లు అధికారులు తేల్చారు.
35 దాకా 5 లీటర్ల బాటిళ్లను, 27 వరకు 2 లీటర్ల బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు.. ఒక్కొక్కటి 15 లీటర్ల పరిమాణంలో ఉన్న 51 టిన్నులను కూడా సీజ్ చేసి.. ఆ షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. మొత్తం సీజ్ చేసిన నూనె విలువ లక్షా 90 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. 1,014 లీటర్ల నకిలీ వంట నూనెను అధికారులు సీజ్ చేశారు.
వెజ్, నాన్వెజ్కర్రీస్, ఫ్రైస్, మిర్చీలు, బజ్జీలు, గారెలు, పిండి వంటకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఐటమ్కు ఆయిల్వాడవలసిందే. ఇంట్లో అయితే మనకు నచ్చిన బ్రాండ్ఆయిల్తెచ్చుకుని వండుకుని తృప్తిగా తింటున్నామని ఇన్నాళ్లు అనుకున్నాం. కానీ.. బయట కొనే ఆయిల్ ప్యాకెట్లు కూడా బ్రాండెడ్ లేబుల్స్ స్టిక్కర్స్ అంటించి మాయ చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం.
Also Read:-కొత్త రూల్..కారు కొంటున్నారా..పార్కింగ్ ప్లేస్ కంపల్సరీ..
రెస్టారెంట్లకు, హోటల్స్, బజ్జీల బండ్లు, ఫాస్ట్ ఫుడ్సెంటర్లకు వెళ్తున్నప్పుడు వారు ఎలాంటి ఆయిల్వాడుతున్నారో మనకు తెలియదు. కొన్ని చోట్ల వాడిన ఆయిల్నే మళ్లీ మళ్లీ వాడుతూ ఫుడ్ఐటమ్స్ప్రిపేర్చేసి వడ్డిస్తుంటారు. వాడిన వంట నూనెను మళ్లీమళ్లీ వాడడం వల్ల గుండె సమస్యలతో పాటు క్యాన్సర్వచ్చే ప్రమాదం కూడా ఉంది.