ఇంట్లో బీరువా పైన బుసలు కొట్టిన నాగుపాము.. పరుగులు పెట్టిన కుటుంబ సభ్యులు

ఇంట్లో బీరువా పైన బుసలు కొట్టిన నాగుపాము.. పరుగులు పెట్టిన కుటుంబ సభ్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం తెలగ రామవరం గ్రామంలోని ఓ ఇంట్లో ఆరడుగుల త్రాచుపాము హల్ చల్ చేసింది.  నారసాని నర్సయ్య ఇంట్లోని బీరువా చాటున సుమారు 6 అడుగుల తాచుపాము చేరి బుసలు కొట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. 

స్థానికుల సమాచారంతో స్నేక్ రెస్క్యూ టీంకు సంఘటన స్థలానికి చేరుకొని స్నేక్ క్యాచర్స్ పి.బలరాం, మహేశ్ లు సుమారు 6 అడుగుల నాగుపామును చాకచక్యంగా బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.  తమ ఇంటి ఆవరణలో నిన్ననే పాము కనిపించిందని.. మళ్లీ చూసేసరికి బీరువాపై చేరి బుసలు కొడుతూ కనిపించిందని నర్సయ్య తెలిపారు. పామును బంధించి అడవిలో వదిలివేయడంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ | Video Viral: పెళ్లి పెటాకులు అయింది.. పాకిస్తానీ మహిళఫుల్​ ఎంజాయి చేసింది​