కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్లో ఏడేండ్ల బాలికపై చర్చిలో డ్రైవర్‌గా పని చేస్తున్న యాబై ఐదేండ్ల వ్యక్తి లైంగికదాడి చేశాడు. నిందితుడిని స్థానికులు, బాలిక బంధువులు పట్టుకుని చితకబాదారు. కాగజ్ నగర్ పెద్ద వాగు రోడ్డులోని సి. బాపు కాలనీలో ఉన్న చర్చిలో రమేశ్(55) డ్రైవర్. ఆ కాలనీకి చెందిన పిల్లలు రోజూ చర్చి ఫాదర్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంటారు. సోమవారం కూడా ఈ పిల్లలు ఆడుకోవానికి వచ్చారు. చర్చి ఫాదర్ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్ రమేశ్ ఆడుకుంటున్న పిల్లల్లో ఓ బాలిక(7)ను బాత్రూంకు లాక్కెళ్లాడు. కర్రతో బెదిరించి అత్యాచారం చేశాడు.
అతడి భార్య ఇంట్లో ఉన్నప్పటికీ పనిలో ఉండడంతో గమనించలేదు. బాలిక రక్తస్రావంతో ఏడ్చుకుంటూ అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో కాలనీవాసులు చర్చి దగ్గరకు వచ్చి రమేశ్‌ను పట్టుకుని చితకబాదారు. రూరల్ సీఐ నాగరాజు, ఎస్సై సోనియా, టౌన్ ఎస్సై చంద్రశేఖర్ అక్కడికి వచ్చి రమేశ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాలిక తల్లిదండ్రులు తుక్కు ఏరుకొని అమ్ముకుంటూ బతుకుతుంటారు. బాధితురాలని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రురల్ సీఐ నాగరాజు తెలిపారు.