- కిందపడ్డ సైకిల్ తొందరగా తియ్యలేదని బీహార్‌లో దారుణం
పాట్నా: బీహార్‌లోని కైమూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు 70 ఏండ్ల ముసలాయనను లాఠీలతో కొట్టారు. ఇంతకూ ఆయన చేసిన తప్పేంటంటే.. రోడ్డు పైనుంచి తన సైకిల్ ను తొందరగా తియ్యకపోవడమే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బభువా సిటీకి చెందిన నావల్ కిశోర్ పాండే (70) ప్రైవేట్ స్కూల్ లో టీచర్. రోజూ సైకిల్ పైనే బడికి వెళ్లొస్తుంటారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఆయన.. రోడ్డుపై సైకిల్ స్కిడ్ అయి కిందపడిపోయారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.
అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సైకిల్ తొందరగా తియ్యాలని పాండేపై అరిచారు. కిందపడ్డ ఆయన లేవడానికి ఇబ్బందులు పడుతుంటే.. సాయం చేయాల్సింది పోయి కోప్పడ్డారు. సైకిల్‌ను పైకి లేపడానికి రెండుమూడు సార్లు ప్రయత్నించిన పాండే.. దాన్ని పక్కకు తియ్యలేకపోయారు. దీంతో కోపానికి వచ్చిన మహిళా కానిస్టేబుళ్లు.. పెద్దాయనను తమ లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తనను కొట్టొద్దని పెద్దాయన వేడుకున్నా వినలేదు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు.
పాట్నా: బీహార్‌లోని కైమూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు 70 ఏండ్ల ముసలాయనను లాఠీలతో కొట్టారు. ఇంతకూ ఆయన చేసిన తప్పేంటంటే.. రోడ్డు పైనుంచి తన సైకిల్ ను తొందరగా తియ్యకపోవడమే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బభువా సిటీకి చెందిన నావల్ కిశోర్ పాండే (70) ప్రైవేట్ స్కూల్ లో టీచర్. రోజూ సైకిల్ పైనే బడికి వెళ్లొస్తుంటారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఆయన.. రోడ్డుపై సైకిల్ స్కిడ్ అయి కిందపడిపోయారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సైకిల్ తొందరగా తియ్యాలని పాండేపై అరిచారు. కిందపడ్డ ఆయన లేవడానికి ఇబ్బందులు పడుతుంటే.. సాయం చేయాల్సింది పోయి కోప్పడ్డారు. సైకిల్‌ను పైకి లేపడానికి రెండుమూడు సార్లు ప్రయత్నించిన పాండే.. దాన్ని పక్కకు తియ్యలేకపోయారు. దీంతో కోపానికి వచ్చిన మహిళా కానిస్టేబుళ్లు.. పెద్దాయనను తమ లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తనను కొట్టొద్దని పెద్దాయన వేడుకున్నా వినలేదు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు.