హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా అంబులెన్స్​లో ప్రసవం

హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా అంబులెన్స్​లో ప్రసవం

కోటగిరి, వెలుగు : నిండు గర్భిణిని హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా అంబులెన్సులోనే శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన  కోటగిరిలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన మధులికకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సోమవారం ఉదయం 3 గంటలకు అంబులెన్సుకు కాల్ చేశారు. అంబులెన్స్ లో ఆమెను కోటగిరి గవర్నమెంట్ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

పేషెంట్ కండిషన్ దృష్ట్యా బాన్సువాడ ఎంసీహెచ్‌‌‌‌కు తరలించాలని డాక్టర్లు చెప్పడంతో కోటగిరి నుంచి బాన్సువాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మధులికకు నొప్పులు ఎక్కువయ్యాయి. అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది అటెండర్ సహాయంతో గర్భిణికి ప్రసవం చేశారు. మధులికకు ఆడబిడ్డ పుట్టింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ గంగారం, పైలట్ రాజులకు గర్భిణి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.