కల్తీ పదార్థాలతో కేకులు.. కాలం చెల్లిన ఫ్లేవర్​లతో తయారీ

కల్తీ పదార్థాలతో కేకులు
కాలం చెల్లిన ఫ్లేవర్​లతో తయారీ
మేడ్చల్​ జిల్లా  ఖాజిపల్లి చౌరస్తాలో బేకరీ సీజ్​
ఐదేండ్లుగా వ్యాపారం.. ఓనర్ అరెస్ట్
కల్తీ పదార్థాలతో కేకుల తయారీ..
బేకరీ సీజ్.. ఓనర్ అరెస్ట్

దుండిగల్, వెలుగు : కల్తీ పదార్థాలు, కాలం చెల్లిన ఫ్లేవర్​లతో కేకులు తయారీ చేసి అమ్ముతున్న ఓ బేకరి గుట్టు రట్టయ్యింది. మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా మల్లంపేట్ ఖాజిపల్లి చౌరస్తాలో ఉన్న ఎస్వీ బేకరీని మేడ్చల్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీ సులు బుధవారం తనిఖీ చేశారు. కాలం చెల్లిన కల్తీ పదార్థాలతో బేకరీ ఐటమ్స్, కేకులు తయారు చేసి అమ్ముతున్నారని గుర్తించారు. గడువు ముగిసిన బటర్ స్కాచ్, ఆరెంజ్, బిస్కట్, మిక్స్ డ్ ఫ్రూట్, కలర్ బాటిల్స్ తో పాటు రూ.15 వేలను సీజ్ చేశారు. యజమాని దామోదర్ రెడ్డి(42)ని అదుపులోకి తీసుకొని దుండిగల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.