ఉప్పల్ లో రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి..

హైదరాబాద్ లో జూలై 15 2024  సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉప్పల్ లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై భారీ గొయ్యి పడింది. ప్రధాన రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ లో రెండు పిల్లర్ల పక్కన రోడ్డు కుంగింది. ఒక కారుకు అదుపు తప్పి గొయ్యిలో పడింది. 

అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వర్షం దాటికి పిల్లర్ చుట్టూ ఉన్న మట్టి భూమిలోకి కూరుకుపోవడంతో పిల్లర్ కు చీరికలు వచ్చాయి. కారు గొయ్యిలో పడటంతో కాసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కారుని గొయ్యి లో నుంచి తీసేశారు. గొయ్యిని పూడ్చేందుకు సన్నాహాలు  చేస్తున్నారు. 

Also Read:-అన్నదాతలకు అండగా నిలిచేది రైతు రుణమాఫీ పథకం