బోథ్ బీజేపీ, బీఆర్ఎస్​కు భారీ షాక్

  • ఆ పార్టీలను వీడిన సీనియర్లు, ప్రజాప్రతినిధులు 
  • సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక 

బోథ్, వెలుగు: బోథ్​నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్​పార్టీలకు భారీ షాక్ ​తగిలింది. ఆ పార్టీలకు చెందిన సీనియర్ ​నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్​లో చేరారు. బోథ్ మండలానికి చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కన్వీనర్ గొర్ల రాజు యాదవ్, ఉపాధ్యక్షుడు అనిల్​అప్ప, బీఆర్ఎస్ నియోజకవర్గ సీనియర్ నేత, సొసైటీ డైరెక్టర్ చట్ల ఉమేశ్, బీఆర్ఎస్ ఎంపీటీసీ చట్ల రజిని, నాయకులు మల్లెపూల లింగారెడ్డి, ఆరె విఠల్, లక్ష్మణ్ సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. హైదరాబాద్​లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో వీరికి రేవంత్​రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సదర్భంగా నేతలు మాట్లాడుతూ ఆదిలాబాద్​ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.