అదుపు తప్పిన బైక్.. పెట్రోల్ లీకై అంటుకున్న మంటలు

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో ఓ బైకు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. బైక్ అదుపు తప్పి పడిపోవడంతో..పెట్రోల్ లీకై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న యువకుడు గాయపడ్డాడు. మంటల్లో బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.