టాలెంట్‌కు కొదువే లేదు. అవిటితనం నా.. శరీరానికి కానీ.. నా ప్రతిభకు కాదని ఓ అంధుడు నిరూపించాడు. ఆర్టీసీ బస్సులో అతను పాడిన పాటకు చప్పట్ల మోత, ప్రయాణీకులందరి అభినందనలు.. ‘ప్రసన్నాజనేయం భజే.. దివ్య కాయం’ అని రెండు చేతులా తాళం వేస్తూ, మరో వైపు తన కాళ్లతో దరువేస్తూ ఓ అంధుడు పాడిన పాట బస్సులో అందరిని మెప్పించింది. ఈ విషయం టీజీఆర్టీసీ పెద్దాయన ఎండీ సజ్జనార్ దగ్గరకి కూడా వెళ్లింది. ఆయన కంటపడితే ఊరికే చూసి వదిలేస్తారా మరి.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆ బాలుడి టాలెంట్‌కు ప్రసంశల వర్షం కురిపించాడు. బ్లైండ్ కుర్రాడు పాట పాడిన వీడియోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!’ అని TGRTC ఎండీ సజ్జనార్ ట్విట్ చేశారు. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ సజ్జనార్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారిని ట్యాగ్ చేశారు.
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS