జేఈఈ మెయిన్స్​లో మెరిసిన అంధ విద్యార్థి

అతను అంధ విద్యార్థి. అలా అని అతను బాధపడలేదు. తన ప్రతిభనే కొలమానంగా తీసుకుని కష్టపడ్డాడు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా బెదరలేడు. అతనే నెల్లూరు కి చెందిన పొంగూరు భాను.  ప్రస్తుతం బాచుపల్లిలో నివసిస్తుండగా, ఇంటర్మీడియట్​ని దగ్గర్లోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశాడు. ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్​ 2023 పరీక్షలో అతను 98.93 శాతం మార్కులతో ఆల్​ ఇండియా ఫిజికల్​ హ్యాండీక్యాప్డ్​ ఓబీసీ కేటగిరీలో 8 వ ర్యాంకు సాధించాడు. 


కంప్యూటర్​ సైన్స్​ అంటే ఇష్టం...


తనకు కంప్యూటర్​ సైన్స్​ అంటే ఎంతో ఇష్టమని ఆ విభాగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకు రావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని అంటున్నాడు. భాను కాలేజీలో చేరినప్పుడే తన లక్ష్యాన్ని వివరించాడని అందుకు అనుగుణంగానే తాము కూడా విద్యార్థి కి వెన్నంటే నిలిచినట్టు డీన్​ రవి వెల్లడించారు. ప్రిన్సిపల్ హరి బాబు  తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.