హైదరాబాద్ ఎల్బీనగర్ లోని చింతలకుంట వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న కారుని వెనకాల నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొడ్డుపల్లి మహేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి.
BMW కారు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నందన్ అనే వ్యక్తి అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కారులో ఉన్న అన్ని సేఫ్టీ బెలూన్లు తెరుచుకోవడంతో అందులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.