పెన్ గంగా నదిలో కొట్టుకుపోయిన నాటు పడవ

పెన్ గంగా నదిలో కొట్టుకుపోయిన నాటు పడవ

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూర్ గ్రామం వద్ద ఉన్న పెన్ గంగా నదిలో నాటు పడవ కొట్టుకుపోయింది. అయితే.. పడవను తీసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా గంగా నది ప్రవాహం పెరగడంతో అందులో చిక్కుకున్నాడు. విషయం తెలియడంతో గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తాడు సహాయంతో బాధితుడిని గ్రామస్తులు రక్షించారు. నాటు పడవ మాత్రం వరదలో కొట్టుకుపోయింది. వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.