బెర్లిన్: జర్మనీలోని కొలోన్ నగరంలో ఓ రెస్టారెంట్లో బాంబ్ పేలింది. బాంబ్ పేలుడు ధాటికి రెస్టారెంట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక మీడియా పేర్కొంది. బాంబ్ బ్లాస్ట్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలంలో భారీ అపరేషన్ చేపట్టిన పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగా స్థానికులను ఇళ్లు విడిచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
ALSO READ | ఇజ్రాయెల్‌పై హౌతీ మిలిటెంట్ల దాడి
ఈ పేలుడుకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హుడీ ధరించి ఉన్న ఓ వ్యక్తి హోటల్ ఎంట్రెన్స్‌లో పేలుడు పదార్థాలు పెట్టి అక్కడి నుండి పారిపోయాడు. అనంతరం రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టగా.. పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.