వరంగల్ లో అనారోగ్యంతో బాలుడు మృతి

  •     ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ నిర్లక్ష్యమే కారణమని సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌
  •     సుమోటోగా తీసుకున్న తెలంగాణ వైద్య మండలి

నెక్కొండ, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నెక్కొండ మండలంలోని ముదిగొండలో సోమవారం ఓ బాలుడు అనారోగ్యంతో చనిపోయాడు. ఇందుకు ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ నిర్లక్ష్యమే కారణమంటూ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. స్పందించిన తెలంగాణ వైద్య మండలి సుమోటోగా స్వీకరించింది. గ్రామానికి చెందిన కావాటి కోటేశ్వర్‌‌‌‌‌‌‌‌ -సరిత దంపతుల పెద్ద కుమారుడు మణి ప్రదీప్ (10)ను నెల రోజుల కింద కుక్క కరిచింది. 

ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం మూడు సార్లు వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంజీఎంకు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు ఇంజక్షన్లు వేశారు. సోమవారం మరో ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉండగా ఎంజీఎంకు వెళ్లలేక స్థానిక ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ చేసిన ఐదు నిమిషాలకే బాలుడు కండ్లు తిరిగి కిందపడడంతో వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంజీఎంకు తరలించారు. బాలుడిని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఆర్‌‌‌‌‌‌‌‌ఎంపీ వేసిన ఇంజక్షన్‌‌‌‌‌‌‌‌ వల్లే బాలుడు చనిపోయాడని సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో తెలంగాణ వైద్య మండలి బాలుడి మరణాన్ని సుమోటోగా స్వీకరించి ఎంక్వైరీ చేపట్టింది.