
- గడ్డి మెషీన్ లో పడి నుజ్జునుజ్జైన బాలుడి చేయి
- మోచేతి కింద వరకు తొలగించిన డాక్టర్లు
- రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లిలో ఘటన
ఎల్లారెడ్డిపేట, వెలుగు: గడ్డిని కట్ చేసే మెషీన్ లో బాలుడి చేయి పడి తెగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన నిమ్మత్తుల మధుకర్ రెడ్డి కొడుకు సుదర్శన్ రెడ్డి (11) ఐదో క్లాస్ చదువుతున్నాడు. ఆదివారం తాత మల్లారెడ్డితో కలిసి ఆవుల షెడ్డుకు వెళ్లాడు. అక్కడ ఆవులకు మేతగా వేసే పచ్చి గడ్డి మెషీన్ కట్టర్ ఉంది. అందులో బాలుడు గడ్డి వేస్తుండగా చేయి లోపలికి వెళ్లడంతో కేకలు వేయడంతో తాత వచ్చి మెషీన్ ఆఫ్ చేశాడు. బాలుడి కుడి చేయి మోచేతి కింద పూర్తిగా నుజ్జునుజ్జైంది. వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ లో తరలించారు. డాక్టర్లు సర్జరీ చేసి మోచేతి కిందికి పూర్తిగా తొలగించారు.