
చిన్న పోరగాళ్లు ఒక్కచోట ఉండరంటే ఉండరు.. వాళ్లు చేసే అల్లరి.. చిలిపి పనులు అంతా ఇంతా కాదు.. ఎప్పుడు ఏం చేస్తరో వాళ్లకే అర్థం కాదు. వాళ్లను ఎప్పుడు ఓ కంట కనిపెడుతుండాలి.. లేకపోతే ఒక్కోసారి ప్రాణాలమీదకు వస్తది. లేటెస్ట్ గా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో మంత్రాలచెరువు దగ్గర ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కు గేటుకు చాలా రోజుల నుంచి తాళం వేసి ఉంది. గత రెండు రోజులు నుంచి గేటు జాలి తొలగించి మార్నింగ్ వాకర్స్ వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన ఓ మహిళ వాకింగ్ చేస్తుండగా.. ఆమె కుమారుడు గేటు మధ్యలో నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో ఆ చిన్నారి తల గేటు ఐరన్ గ్రిల్ మధ్యలో ఇరుక్కుపోయింది.
ALSO READ : ఈమె కిందపడితే లేపడానికి ఫైర్ సిబ్బంది వచ్చారు...
ఎంతకీ బయటకు రాకపోవడంతో చిన్నారి ఏడవడం మొదలు పెట్టాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో చిన్నారిని బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.