
చదువు పక్కన పెట్టి పాతసామాను కొంటామంటూ కరీంనగర్‌లో ఓ బాలుడు బుధవారం ఆటోలో మైక్ పట్టుకొని తిరుగుతున్నాడు. పొట్టకూటి కోసం పిల్లలతో పనిచేయిస్తూ వారి భవిష్యత్‌ను దెబ్బతీస్తున్నారు. బాలకార్మికులతో పనులు చేయిస్తున్నా.. ఇలా రోడ్లపై తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.