యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ.. ఉరేసుకున్న బాలుడు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ.. ఉరేసుకుని బాలుడు చనిపోయాడు. ఎల్లారెడ్డిపేట మండలం కృష్టు నాయక్ తండాకు చెందిన ఉదయ్ అనే బాలుడు య్యూటూబ్ లో వీడియోలు చూస్తూ రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. 

ఎంత సేపు పిలిచినా సమాధానం రాకపోవడంతో తలుపులు పగులగొట్టారు తల్లిదండ్రులు. అప్పటికే గోడకు ఉన్న మేకుకు లుంగీతో ఉరేసుకున్నాడు బాలుడు. వెంటనే బాలుడిని ఓ ప్రైవేట్ హస్పిటల్ కు తరలించారు పేరేంట్స్. 

అప్పటికే ఉదయ్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సిరిసిల్ల ఏరియా హస్పిటల్ కు తరలించారు పోలీసులు.