కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండోర్ లో కొనసాగుతున్న పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. యష్‌రాజ్ పర్మార్ అనే బాలుడు పిగ్గీ బ్యాంకులో తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని రాహుల్‌గాంధీకి అందించాడు. ఈ మొత్తాన్ని యాత్ర కోసం వినియోగించాలని కోరాడు. దీనిపై స్పందించిన.. రాహుల్ ‘‘త్యాగం, నిస్వార్థతత్వం.. చిన్నతనంలోనే అలవరచుకొనే విలువలు. ఈ పిగ్గీ బ్యాంక్ నాకు అమూల్యమైనది. అనంతమైన ప్రేమ నిధి’’ అంటూ ట్వీట్ చేశారు.
‘భారత్ జోడో యాత్ర అంటే హిందువులు, ముస్లింలను కలపడానికే.. వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. వాళ్లిద్దరూ ఒక్కటేనని నాకు అర్థమైంది’ అని యష్‌రాజ్ పర్మార్ చెప్పాడు. భారత్ జోడో యాత్ర నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుంది.