రంగారెడ్డి: పాపం.. ఇంటి ముందు ఆడుకుటున్న బాలుడిని ఆటో రూపంలో మృత్యువు బలిగొంది. వేగంగా వచ్చిన ఆటో బాలుడి ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మద్యం సేవించి అతివేగంగా ఆటో నడిపి చిన్నారి చంపేశాడు ఆటో డ్రైవర్.. అప్పటివరకు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న బాలుడు.. క్షణాల్లో ప్రాణం పోయి చలనం లేకుండా పడిపోయాడు.. శరీర భాగాలు ఛిద్రమై రక్తపు మడుగులో కొట్టుకుంటూ చనిపోయాడు. మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలోని జరిగిన ఈ ఘటన చూసిన వారిన హృదయాలను కదిలించింది.
- ALSO READ | ఎయిర్ పోర్టులో ఫారిన్ కరెన్సీ పట్టివేత
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలోని మధుబన్ కాలనీలో బతుకు దెరువు కోసం మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం మధుబన్ కాలనీలో నివాసం ఉంటోంది. వారి కుమారుడు మూడేళ్ల వికాస్ ఇంటిముందు ఆడుకుంటుండగా శనివారం (సెప్టెంబర్ 16) సాయంత్రం ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వికాస్ అక్కడికక్కడే మృతిచెందాడు.. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.