నీటి సంపులో పడి బాలుడు మృతి

నీటి సంపులో పడి బాలుడు మృతి

పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో నీటిసంపులో పడి మూడేండ్ల బాలుడు చనిపోయాడు. ధర్మసోత్ కిరణ్ , పద్మకు శ్రవణ్, నిఖిల్ సాయి (3) కొడుకులు. శుక్రవారం ఇద్దరూ ఇంటి బయట ఆడుకుంటున్నారు. తండ్రి రైస్ మిల్ కు పనికి వెళ్లగా తల్లి ఇంట్లో వంట చేస్తోంది. నిఖిల్ సాయి మామిడికాయ తిన్నాక చేతులు కడుక్కునేందుకు ఇంటి పక్కనున్న సంపు దగ్గరకు వెళ్లాడు. సంపులోకి వంగగా జారి పడి మునిగిపోయాడు. నిఖిల్​ కనిపించకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికినా కనిపించలేదు. నీటి సంపులో చూడగా విగతజీవిగా నీళ్లలో పడి ఉన్నాడు. వెంటనే పెనుబల్లి ఏరియా దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు.