కుక్కకాటుకు బాలుడి మృతి

కుక్కకాటుకు బాలుడి మృతి

మాక్లూర్, వెలుగు: కుక్కకాటుకు ఐదేండ్ల బాలుడు మృతిచెందిన ఘటన మాక్లూర్ పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం కల్లడి గ్రామానికి చెందిన హర్షవర్ధన్​(5) డిసెంబరు 25న తన తాత ధర్మన్నతో కలిసి పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒక గొర్రెల కాపరికి చెందిన కుక్క బాలుడిని కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని హాస్పిటల్​కు తీసుకెళ్లారు.

ట్రీట్​మెంట్​పొందుతున్న హర్షవర్ధన్​కు ఈ నెల 3 నుంచి తీవ్ర విరేచనాలతో పాటు, జ్వరం వచ్చింది. మెరుగైన ట్రీట్​మెంట్​కోసం హర్షవర్ధన్​ను ఆదివారం రాత్రి హైదరాబాద్​కు అంబులెన్స్​లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. సోమవారం గ్రామంలో అంత్యక్రియలు చేశారు.