పెళ్లి మంటపానికి ట్రాక్టర్ నడుపుతూ వచ్చిన వధువు

ట్రెండ్ మారుతోంది. కాలానికి అనుగుణంగా.. మనుషులు కూడా మారుతున్నారు. ప్రధానంగా వివాహ వేడుకల్లో నూతన వధూ వరులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. వినూత్నంగా వివాహాలు చేసుకుంటూ.. వార్తల్లో నిలుస్తున్నారు. మరికొంతమంది పెళ్లి మంటపాలకు వెరైటీగా వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా కనిపించాలనే ఉద్ధేశ్యంతో వారు ఇలా చేస్తున్నారు. సిగ్గుతో మొగ్గలవాల్సిన వధువు డ్యాన్స్ లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ వధువు పెళ్లి మంటపానికి ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో చోటు చేసుకుంది. 

జావ్రా గ్రామానికి చెందిన భారతి తద్గేకు ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయత్రం వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఇరువురు కుటుంబసభ్యులు కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు. వధువు భారతి కూడా వచ్చింది. కానీ.. నడుచుకుంటూ రాలేదు. అన్నదమ్ములిద్దరినీ చెరోపక్క నిల్చొని ఉండగా.. ట్రాక్టర్ నడుపుకుంటూ.. వచ్చింది. పట్టు చీర, కళ్లద్దాలు ధరించి హుందాగా.. ఏ మాత్రం భయం లేకుండా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చిన వధువును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. Anurag Dwary వ్యక్తి ట్వీట్ చేశారు. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -
డ్రగ్స్ కేసులో ఆర్యన్కు క్లీన్ చిట్..


ప్లాట్‌ఫాంపై ప్రయాణికుల గార్బా డ్యాన్స్