కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ రోజు ఉదయం క్షణాల వ్యవధిలోనే ఒక బిల్డింగ్ కుప్పకూలిపోయింది. చూస్తుండగానే ఒక్కసారిగా ఒక వైపుకు ఒరిగి పూర్తిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు గానీ, ప్రాణహాని గానీ జరగలేదు.
ఈ బిల్డింగ్ చాలా పాత కాలపుదని తెలుస్తోంది. ఇది ఒక వైపుకు ఒరిగి.. ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని బిల్డింగ్‌లో ఉన్న వాళ్లందరినీ ఖాళీ చేయించారు. అది కూలడానికి ముందే అంతా బయటపడడంతో ఎవరికీ ఏం కాలేదు.
#WATCH | Karnataka: A building collapsed in Bengaluru today, no casualties or injuries reported so far. Fire Department had evacuated the building before it collapsed. Officials rushed to the spot. Details awaited. pic.twitter.com/oWmUBsFm6E
— ANI (@ANI) September 27, 2021