పుట్టినరోజు వేడుకలకు రాజమండ్రికి వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ చేశారు దుండగులు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న శివ రాం ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సుమారు రూ.15 లక్షలు విలువ చేసే నగలను దొంగలించారు. ఇంట్లో వస్తువులు అన్నీ చిందరవందరగా పడేసి.. ఇల్లు గుల్ల గుల్ల చేశారు. బీరువా లాక్ పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు.
పుట్టినరోజు వేడుకలు కోసం రాజమండ్రికి వెళ్లి తిరిగి వచ్చేలోపు దొంగతనం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న విలువైన వస్తువులు అపహరించినట్లు తెలిపారు. వెంటనే ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనస్థలికీ చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.