బర్త్​డే పార్టీకి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

బర్త్​డే పార్టీకి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
  • రూ.15 లక్షల బంగారం చోరీ

అల్వాల్, వెలుగు : బర్త్​డే వేడుకలకు వెళ్లొచ్చేసరికి ఇంటిని దొంగలు గుల్ల చేశారు. అల్వాల్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీకి చెందిన శివ రాంప్రసాద్ తన బామ్మర్ది పుట్టినరోజు వేడుకల కోసం రాజమండ్రికి వెళ్లాడు. శనివారం తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో బాధితుడు కంగుతిన్నాడు.

బీరువాలోని దాదాపు రూ.15 లక్షల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.