ఢిల్లీలో ప్రమాదవశాత్తు ఓ బస్సు దగ్ధమైంది. జగత్ పురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. షార్ట్ సర్య్కూట్ కారణంగా బస్సులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.