
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. ప్రచారంలోనూ స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. ఆదివారం (అక్టోబర్ 15న) హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రచారం మొదలుపెట్టనున్నారు.
17 రోజుల్లో 42 సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేశారు. ఆ ప్రచార రథంపై కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగుతో తీర్చిదిద్దారు.
Also Read : ఇగోలు పక్కన పెట్టండి..బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్
2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈ బస్సును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బహుమతిగా ఇచ్చారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొన్నిరోజుల క్రితమే అది యూపీ నుంచి రాష్ట్రానికి చేరింది. ఈ బస్సు ఆదివారం (అక్టోబర్ 15) నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై పరుగులు పెట్టనుంది.