నిజామాబాద్ జిల్లా పెర్కిట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇవాళ తెల్లవారుజాము ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందంటున్నారు.