సంగారెడ్డి జిల్లా : జహీరాబాద్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై అదుపు తప్పిన ఓ బస్సు ఢివైడర్ ను ఢీకొట్టి పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిఉండేది. జహీరాబాద్ పట్టణంలోని తాండూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పై పిరమిల్ కంపెనీ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. దీంతో బస్సు డివైడర్ ను ఢీకొట్టి బ్రిడ్జ్ అంచున బస్సు ఆగిపోయింది.
బస్సులో విరమిల్ కంపెనీ కార్మికులు ఉన్నారు. కాస్త ఉంటే బస్సు బ్రిడ్జ్ పై నుంచి కింద పడి ఉండేది. బస్సు ముందు టైర్లు గాల్లో తేలుతున్నాయి. వెంటనే బస్సులో ఉన్నవారు కిందకి దిగిపోయారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.. కార్మికులు అంతా క్షేమంగా బయటపడ్డారు.