
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి సతీశ్ సుమారు రూ. ఐదు కోట్లు తీసుకుని కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. అవసరం ఉందని చెప్పి రూ. లక్షలకు లక్షలు అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా గత బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడని 50 మంది బాధితులు శుక్రవారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యాపారి ఇప్పటికే కొందరికి ఐపీ నోటీసులు పంపించినట్టు తెలుస్తున్నది.