బాచుపల్లిలో ఓవర్ స్పీడ్తో కారు బీభత్సం..

 బాచుపల్లిలో ఓవర్ స్పీడ్తో కారు బీభత్సం..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో దూసుకొచ్చిన కారు..రోడ్డుపక్కనే ఉన్న చెరుకురసం డబ్బాదుకాణాన్ని ఢీకొ ట్టిం ది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.ప్రమాద సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారు మాజీ మంత్రి మల్లారెడ్డి పేరున్న స్టిక్కర్ తో  ఉండటం చర్చనీయాంశమైంది. 

Also Read :- చందానగర్​ లో మాదక ద్రవ్యాలు రవాణా.. ఇద్దరు అరెస్ట్​

గండిమైసమ్మ నుంచి బాచుపల్లి వైపు వెళ్తున్న హ్యుందాయ్ వెర్నాకారు.. బాచుపల్లి పీఎస్ పరిధిలోని ప్రగతినగర్లో  వీఎన్ఆర్ విజ్ణాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ సమీపం లో రాగానే అదుపు తప్పి వీఆర్ఎస్ విజ్ణానజ్యోతి స్కూల్ గేట్ ముందున్న చెరుకురసం దుకాణంలోకి దూసుకెళ్లింది. ఓవర్ స్పీడ్తో బలంగా ఢీకొట్టడంతో డబ్బా మొత్తం ధ్వంసమైంది.  ప్రమాదానికి గురైన కారుపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీ పాస్ ఉండడం విశేషం.