వరంగల్ జిల్లాలో విషాదం.. ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లిన కారు

వరంగల్ జిల్లాలో విషాదం.. ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లిన కారు

వరంగల్ జిల్లా: సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో కారు ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కెనాల్లో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు (తండ్రి కూతురు) గల్లంతు కావడం విషాదం నింపింది. పిల్లాడు మృతి చెందాడు. ప్రవీణ్ అనే వ్యక్తి కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతని భార్య కృష్ణవేణిని స్థానికులు కాపాడారు. 

ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబం.. ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సోమారపు ప్రవీణ్ ఫ్యామిలీగా పోలీసుల విచారణలో తేలింది. కారు అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ALSO READ | జగిత్యాల జిల్లాలో విషాదం.. తెల్లవారితే పెళ్లి.. పెళ్ళికొడుకు ఎందుకిలా చేశాడో..!

భర్త, కూతురు కెనాల్లో గల్లంతు కావడం, ప్రాణం లేని స్థితిలో కొడుకు కళ్ల ముందు కనిపించడంతో బాధితురాలు కన్నీరుమున్నీరయింది. చనిపోయిన కొడుకును ఒడిలోకి తీసుకుని దిక్కులు పిక్కటిల్లేలా విలపించింది. ఆమె రోదించిన తీరు చూసి స్థానికుల భావోద్వేగానికి లోనయ్యారు. అప్పటి దాకా ఆనందంగా కారులో వస్తున్న కుటుంబం కళ్ల ముందు ఛిన్నాభిన్నం అవడంతో కృష్ణవేణి తల్లడిల్లిపోయింది. భర్త, కూతురు ఆచూకీ కోసం కృష్ణవేణి దీనంగా ఎదురుచూస్తోంది. భర్త, కూతురైనా క్షేమంగా తిరిగి రావాలని ఆశగా చూస్తోంది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. గజ ఈతగాళ్లు ప్రవీణ్, అతని కూతురు కోసం కెనాల్లో గాలిస్తున్నారు.