గుండ్రాంపల్లి వద్ద ప్రమాదం: కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

గుండ్రాంపల్లి వద్ద ప్రమాదం: కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద ప్రమాదం జరిగింది. శుక్రవారం (నవంబర్ 1) అర్థరాత్రి జాతీయ రహదారిపై ప్రయాణిస్తోన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.