బంజారాహిల్స్​లో కారు బీభత్సం

బంజారాహిల్స్​లో కారు బీభత్సం

బషీర్​బాగ్​, వెలుగు: బంజారాహిల్స్​లో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే మార్గంలో అతివేగంతో అదుపు తప్పి డివైడర్ ​పైకి దూసుకెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ ​కావడంతో కారులోని వారికి పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అందులోని వ్యక్తులు కారును అక్కడే వదిలేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.