నవసరి: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీకొనడంతో 9 మంది మృతి చెందా రు. మరో 29 మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివా రం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో నవసరి జిల్లా వెస్మా గ్రామం దగ్గర్లో జరిగింది. భరూచ్ జిల్లాలోని అంకలేశ్వర్‌కు వెళ్తున్న ఓ కారు, వల్సాద్ వైపు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. కారు డ్రైవర్ అదుపు తప్పి డివైడర్‌ను దాటుకొని అవతలి వైపు వస్తున్న లగ్జరీ బస్సును ఢీకొట్టాడని నవసరి జిల్లా ఎస్పీ రుషికేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయిందన్నారు.
దీంతో కారులో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మరణించాడని తెలిపారు. ఇంకో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందన్నారు. గాయపడ్డ వారిని స్థానిక హాస్పిటళ్లకు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని వెల్లడించారు. బస్సులో ఉన్న మెజారిటీ ప్యాసింజర్లు వల్సాద్ జిల్లాకు చెందిన వారని, కారులో భరూచ్, జునాగఢ్, సూరత్, రాజ్‌కోట్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని, వీరు అంకలేశ్వర్‌లో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై ప్రదాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.