
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు. కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంతో హైవేపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కారు హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.