ఆటోను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ జాతీయ రహదారి 65 మునగాల మండలం ఆకుపాముల సమీపంలో ఆటోను ఓ కారు ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మందిలో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం డాక్టర్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ముకుందాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరై తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు.