మెదక్ పట్టణంలో కారు బీభత్సం : ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతి

మెదక్ పట్టణంలో కారు బీభత్సం : ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతి

మెదక్ : మెదక్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన  నడుచుకుంటూ వెళ్తున్న మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులపైకి అతివేగంగా కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పారిశుధ్య మహిళా కార్మికులు చనిపోయారు. మరోకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

చనిపోయిన వారిలో నర్సమ్మ, యాదమ్మ ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.