నల్లగొండ జిల్లాలో బుధవారం (సెప్టెంబర్ 20న) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద సాయంత్రం కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. ఆ తర్వాత కారు సైతం రోడ్డుపై పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు సైతం ప్రాణాలు కోల్పోయారు.
గాయపడ్డ వారిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మద్దిమడుగు ప్రసాద్, అక్షయ్ చనిపోయారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.