రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ PVNR ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబర్ 175 దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కారు టైర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
టైర్ పేలగానే కారు డివైడర్ ఎక్కి, అవతలి వైపు ఉన్న కారును ఢీకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు అరాంఘర్ నుంచి మెహదిపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఒకవైపు భారీగా ట్రాఫిక్ జామైంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు..