
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కాంచీపురానికి చెందిన ఆనంద్ మురుగన్, మురుగన్ సుబ్బరాజ్ మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ సందర్భంగా తిరుమలకు వచ్చారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కారులో మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా.. 30వ మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డుపై నుంచి అటవీ ప్రాంతంలోని లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బంది అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు.